నిన్న గురువారం సైఫ్ అలీ ఖాన్ పై ఓ దొంగ దాడి చెయ్యడం ఎంతగా హాట్ టాపిక్ అయ్యిదో అందరూ చూసారు. దొంగ దాడిలో తీవ్రంగా గాయపడిన సైఫ్ ని కుటుంబ సభ్యులు ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్చడం, వైద్యులు సైఫ్ ని ట్రీట్ చేసి అతనికి ప్రమాదం లేదు అని చెప్పడంతో సైఫ్ అభిమానులు రిలాక్స్ అయ్యారు.
సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోని సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు నిందితుడిని గుర్తించడమే కాదు, ఈ కేసు ని సాల్వ్ చెయ్యడానికి ఎంకౌంటర్ స్పెషలిస్ట్ దయ ని దించడం అంతా చకచకా జరిగిపోయింది. తాజాగా సైఫ్ పై దాడి చేసిన నిందితుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేసారు.
36 గంటలు తిరిగేలోపే నిందుతుణ్ణి పోలీసులు బాంద్రా ప్రాంతంలోనే అరెస్ట్ చేశారు. రాత్రిపూట ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించడంతో పాటు దొంగతనం కోసం వచ్చి హత్యాయత్నానికి పాల్పడడంతో సెక్షన్ 331(4), సెక్షన్ 311 కింద అతనిపై పోలీసులు కేసు పెట్టి సదరు దొంగని బాంద్రా పోలీసులు విచారిస్తున్నారు.