బాలీవుడ్ స్టార్ హీరోల విషయంలో ఏం జరుగుతుంది. మిన్నగాక మొన్న సల్మాన్ ఖాన్ ని చంపేస్తామని బెదిరింపులు, ఆ దెబ్బకు సల్మాన్ కట్టుదిట్టమైన భద్రతా నడుమ బయట అడుగుపెడుతున్నారు. మరోపక్క స్టార్ నటుడు సైఫ్ అలిఖాన్ ఇంట్లోకి దొంగల ప్రవేశం, దొంగతనానికి వచ్చినవాళ్లు సైఫ్ ని కత్తితో పొడవడం అనేది కలకలం సృష్టించింది.
సైఫ్ అలీ ఖాన్ ఉండే ప్యాలెస్ లాంటి ఇంట్లోకి దొంగలు చొరబడడమే వింత అనుకుంటే, అక్కడ అంతమంది పని వాళ్ళను వదిలేసి సైఫ్ ని పొడవడం అనేది మరింత షాకిచ్చే విషయం. తన ఇంట్లోని వ్యక్తిగత సిబ్బందిని దాటుకుని దొంగ చొరబడడం, ఆతర్వాత సెక్యూరిటీ ని పిలవకుండా సైఫ్ ఆ దొంగపై సినిమా మాదిరి ఫైట్ చేసి గాయాలపాలవడం అన్నీ విచిత్రమే.
అదంతా ఒక ఎత్తు సైఫ్ ని ఆటోలో ఆసుపత్రి కి తరలించడం మరో ఎత్తు. సెలబ్రిటీస్ ఇంట్లో కార్లు తక్కువా, వాళ్లకు డ్రైవర్స్ కరువా, ఏదైనా సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోని కార్లన్నీ వదిలేసి ఆయన కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ తండ్రిని ఆటో రిక్షాలో లీలావతి ఆసుపత్రికి తీసుకుని వెళ్లి జాయిన్ చెయ్యడం చూసిన వారు అంత డబ్బున్నా కార్లు కరువు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అసలు సైఫ్ అలీ ఖాన్ విషయంలో ఏం జరుగుతుంది. ఏం జరగబోతుంది అనేది ఆయన అభిమానులకు అంతుబట్టడం లేదు.