కోలీవుడ్ స్టార్ అజిత్‌కుమార్-మగిళ్ తిరుమేని కలయికలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం విడాముయర్చి. ఈ చిత్రం తెలుగులో పట్టుదల టైటిల్ తో విడుదల చేస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఫిబ్రవరి 6న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతోంది. పట్టుదల సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్, ప్రమోషనల్ కంటెంట్‌కు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా పట్టుదల సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.
పట్టుదల ట్రైలర్ లోకి వెళితే.. అజిత్ స్టైలిష్‌గా సాల్ట్ అండ్ పేపర్ లుక్‌తో నెవర్ బిఫోర్ అవతార్‌లో మెప్పించబోతున్నారు. తన వాళ్ల కోసం అజిత్ విలన్స్‌తో చేస్తున్న పోరాటాలు, అజిత్, చార్మింగ్ బ్యూటీ త్రిష మధ్య కుదిరిన క్యూట్ కెమిస్ట్రీతో పాటు అజర్ బైజాన్‌లో చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్‌లు అబ్బురపరుస్తున్నాయి. యాక్షన్ కింగ్ అర్జున్ ఓ వైపు జైలులో ఖైదీగా, మరోవైపు స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు. రెజీనా కసాండ్ర సైతం ఇప్పటి వరకు చేయనటువంటి వైవిధ్యమైన పాత్రలో అలరిస్తుందని ట్రైలర్‌లో ఆమెను చూస్తుంటేనే అర్తమవుతుంది.