సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఈరోజు గురువారం తెల్లవారుఝామున ఓ దొంగ సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు.సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడి దోపిడీ చేసే క్రమంలో తనకి అడ్డొచ్చిన సైఫ్ పై ఆ దొంగ ఆరుమార్లు కత్తి తో దాడి చెయ్యగా ఈ ఘటనలో సైఫ్ అలీఖాన్ గాయపడ్డారు.
దొంగ సైఫ్ ని గాయపరిచి దొరక్కుండా తప్పించుకున్నాడు, దొంగ చేతిలో కత్తి పోట్లకి గురైన సైఫ్ ని ఆయన కొడుకు ఇబ్రహీం ఆటోలో ఆసుపత్రికి తరలించడం హాట్ టాపిక్ అయ్యింది. సైఫ్ కి ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లోని కార్లు అందుబాటులో లేకపోవడంతో సైఫ్ కొడుకు ఆయన్ని ఆటోలో ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ పరిస్థితి బాగానే ఉంది అని, చికిత్స తర్వాత సైఫ్ క్షేమంగా ఉన్నట్లుగా డాక్టర్స్ అనౌన్స్ చేసారు. ఇక సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రముఖ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ దయ నాయక్ రంగంలోకి దిగడం ఇప్పుడు ఈ కేసులో ఇంట్రెస్టింగ్ గా మారింది.