గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా విడుదల కాగా.. రామ్ చరణ్ తదుపరి మూవీ బుచ్చిబాబు దర్శకత్వంలో RC16 పట్టాలెక్కేసింది. ఇప్పటికే మైసూర్ షెడ్యూల్, హైదరాబాద్ లోను మరో షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ విలన్ గా కనిపించబోతున్నారు.
ఈ చిత్రంలో మరో సీనియర్ నటుడు జగపతి బాబు కూడా కీ రోల్ లో కనిపించబోతున్నారు. తాజాగా తన పాత్ర తాలూకు మేకప్ వేసుకుంటూ చాలా కాలం తర్వాత బుచ్చిబాబు RC16 కి మంచి పని పెట్టాడు. గెటప్ చూసిన తర్వాత నాకు చాలా తృప్తిగా ఉంది అంటూ జగపతి బాబు తన పాత్ర మేకప్ వీడియో షేర్ చేసారు.
ఆ వీడియో లో జగపతి బాబు RC16 కు రెడీ అవుతున్నారు, తన పాత్ర పై జగపతి బాబు చేసిన కామెంట్స్ పై మెగా ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు.