ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప ది రైజ్‌కు సీక్వెల్‌గా వచ్చిన పుష్ప 2 ది రూల్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 1800 కోట్లకి పైగా రాబట్టి ఇండియన్ సినిమా హిస్టరీలోనే సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా 2 వేల కోట్ల మ్యాజిక్ ఫిగర్‌ని చేరుకోవాలని చేస్తున్నారో.. లేదంటే వేరే మ్యాటర్ ఏదైనా ఉందో తెలియదు కానీ.. ఈ సినిమా విషయంలో మేకర్స్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు.
పుష్ప 2 రీలోడెట్ అంటూ మరో 20 నిమిషాల ఫుటేజ్‌ని యాడ్ చేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాదు, జనవరి 14న సంక్రాంతి స్పెషల్‌గా థియేటర్లలో యాడ్ చేసి సరికొత్తగా ప్రదర్శించాలని చూశారు. తద్వారా సంక్రాంతి సినిమాలకు ఇబ్బంది ఏర్పడటంతో, ఇండస్ట్రీ పెద్దలు కలగజేసుకుని జనవరి 17కి వాయిదా వేయించడంతో.. అల్లు అర్జున్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇప్పుడు న్యూ వెర్షన్‌ని జనవరి 17న యాడ్ చేయబోతున్నట్లుగా తెలుపుతూ.. నైజాం మొత్తం ఈ సినిమాకు టికెట్ల ధర ఎంత ఉంటుందో కూడా మేకర్స్ తెలిపారు.
నైజాం మొత్తంలో సింగిల్ స్క్రీన్‌లో రూ. 112, మల్టీఫ్లెక్స్‌లో రూ. 150 ధరను ఫిక్స్ చేసినట్లుగా మేకర్స్ అధికారికంగా పోస్టర్‌ను విడుదల చేశారు. మరి ఈ లోడెడ్ వెర్షన్ ఎలాంటి స్పందనను రాబట్టుకుంటుందో తెలియదు కానీ, ఒకవేళ వర్కవుట్ అయితే మాత్రం.. ముందు ముందు ఇలాంటి ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశం అయితే లేకపోలేదు.