ఈ రోజు గురువారం తెల్లవారుఝామున బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఓ దొంగ చేసిన దాడి లో సైఫ్ అలీ ఖాన్ కు ఆరు కత్తిపోట్లు దిగడం కలకలం సృష్టించింది. తెల్లవారుఝామున ఓ దొంగ సైఫ్ ఇంట్లోకి ప్రవేశించిన దొంగ తనకు అడ్డొచ్చిన సైఫ్ పై విచక్షణారహితంగా కత్తితో పొడిచినట్లుగా తెలుస్తోంది.
గాయపడిన సైఫ్ ని వెంటనే ముంబైలోని లీలావతి ఆసుపత్రి కి తరలించగా, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స జరుగుతుంది. సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగిన విషయం తెలుసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక్కసారిగా షాకవడమే కాకుండా సోషల్ మీడియాలో సైఫ్ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేసారు.
దేవర చిత్రంలో ఎన్టీఆర్ కి విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటించిన విషయం తెలిసిందే. సైఫ్ అలీ ఖాన్ కత్తిపోట్లకు గురైన విషయం తెలిసి బాలీవుడ్ స్టార్స్ లీలావతి ఆసుపత్రికి వెళ్లి ఆయన పరిస్థితిని తెలుసుకుంటూ సైఫ్ కుటుంబానికి ధైర్యం చెబుతున్నారు.