Advertisement
Google Ads BL

దబిడి దిబిడి స్టెప్‌పై ఊర్వశి వివరణ


నటసింహం బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ చిత్రం విడుదలైన మొదటి ఆట నుండే పాజిటివ్ స్పందనను రాబట్టుకుని థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. అయితే ఈ సినిమాలో బాలయ్య, ఊర్వశి రౌతేలా డ్యూయట్ దబిడి దిబిడిలో ఒక స్టెప్ బాగా కాంట్రవర్సీ అవుతోన్న విషయం తెలిసిందే. అదే స్టెప్ చిరంజీవి వేసి ఉంటే.. ఇప్పుడెన్ని రకాలుగా వార్తలు వైరల్ చేసేవారో అంటూ డైరెక్ట్‌గానే కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ వివాదంపై తాజాగా ఊర్వశి రౌతేలా వివరణ ఇచ్చింది. 

Advertisement
CJ Advs

ఆమె మాట్లాడుతూ.. సక్సెస్ అయిన సినిమా గురించి పలు రకాలుగా అభిప్రాయలు రావడం సహజమే. నాకు ఆ విషయం బాగా తెలుసు. బాలయ్యగారితో డ్యాన్స్, నటనకు ప్రాధాన్యమున్న సినిమాలను నేను గౌరవిస్తాను. ఆయనతో కలిసి పనిచేయడం మరిచిపోలేని అనుభవం. ఆయన లెజెండ్. ఇక డ్యాన్స్ అంటారా? అది కళలో భాగం మాత్రమే. దానిని వేరేలా చూడాల్సిన అవసరం లేదు. బాలయ్యగారితో డ్యాన్స్ చేయడం ఎప్పటికీ గౌరవంగానే భావిస్తాను. ఆయనతో పని చేయడం అనేది ఒక డ్రీమ్ లాంటిది. అది నెరవేరింది. సెట్‌లోనూ, బయట ఆయన ఆర్టిస్ట్‌లకు ఎంతగా గౌరవం ఇస్తారో, ఎంతగా సపోర్ట్ చేస్తారో.. తెలిస్తే ఇలా ఎవరూ మాట్లాడరు.. అంటూ ఊర్వశి చెప్పుకొచ్చింది.

ఇప్పుడే కాదు ఇంతకు ముందు కూడా ఊర్వశి ఈ పాటపై వస్తున్న ట్రోల్స్‌పై స్పందించింది. లైఫ్‌లో ఏం సాధించలేని వారు చేసే కామెంట్స్‌ని అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఇతరులను విమర్శించే ముందు.. వారు ఏం సాధించారో ముందు తెలుసుకోవాలని, కష్టపడేవారిని గౌరవించడం నేర్చుకోవాలనేలా ఆమె ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కి ఇచ్చిపడేసింది. 

Urvashi Rautela Responds to Controversial Dance Step in Dabidi Dabidi Song:

Urvashi Rautela Defends Dance with Balakrishna Amidst Social Media Backlash
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs