Advertisement
Google Ads BL

కల్కి 2 : కమల్ - ప్రభాస్ మధ్య రసవత్తర పోరు


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మహానటి నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 AD చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మంచి హిట్ అయ్యింది. కమల్ హాసన్ విలన్ గా అమితాబ్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించగా చాలామంది స్టార్స్ గెస్ట్ రోల్స్ ప్లే చేసారు. కల్కి 1 గత ఏడాది జూన్ లో విడుదల కాగా దానికి సీక్వెల్ గా రాబోయే కల్కి 2 పై భీభత్సమైన అంచనాలున్నాయి.

Advertisement
CJ Advs

కల్కి 2 షూటింగ్ ఏప్రిల్ నుంచి మొదలు పెట్టి నాలుగు నెలల్లో కంప్లీట్ చేసేసి వచ్చే ఏడాది అంటే 2026 లో కల్కి 2 ని పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని వైజయంతి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా కల్కి 2 షూటింగ్ అప్ డేట్ అలాగే రిలీజ్ ప్లాన్స్ గురించి తాజాగా నిర్మాత అశ్విని దత్ కీలక అప్ డేట్ ఇచ్చారు. కల్కి 2 మొత్తంలో కమల్ హాసన్ కనిపిస్తారు. ప్రభాస్-కమల్ మధ్యన హోరాహోరీ ఫైట్స్ ఉంటాయి, వారి నడుమ రసవత్తర పోరు నడుస్తుంది. 

అమితాబ్ బచ్చన్ పాత్ర  పార్ట్-2లో కూడా కీలకంగా ఉంటుంది. అంతేకాదు దీపిక పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. కల్కి 2 లో వీరే మెయిన్. కథ ప్రకారం కొత్త పాత్రలు ఉండే అవకాశం చాలా  తక్కువ, షూటింగ్ అతి త్వరలో మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి, కల్కి 2 2026 లో రిలీజ్ ఉంటుంది అంటూ అశ్విని దత్ కల్కి 2 పై ఇచ్చిన అప్ డేట్ ప్రభాస్ ఫ్యాన్స్ ను ఎగ్జైట్ అయ్యేలా చేసింది. 

Kamal - Prabhas fight in Kalki 2:

Kalki 2898 AD sequel to release in this year
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs