ఈరోజు జల్లికట్టు దగ్గర నుంచి మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గరకు మంచు మనోజ్ వస్తున్నాడని తెలిసి పోలీసులు గట్టి బందోబస్త్ ఏర్పాటు చేసారు. సంక్రాంతి సెలెబ్రేషన్స్ కోసం మోహన్ బాబు ఇంకా మంచు విష్ణు మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గరే ఉండడంతో మనోజ్ ఎంట్రీ వలన రచ్చ జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు.
తాజాగా మంచు మనోజ్ మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గరకు రావడమే కాదు గేట్లు తియ్యాలంటూ హంగామా చేసాడు., తన తాతనాన్నమ్మ సమాధుల వద్దకు వెళ్లనివ్వాలని, తాను తాత సమాధి దగ్గర దణ్ణం పెట్టుకుని వెళ్ళిపోతాను, ఎలాంటి గొడవ చెయ్యను అన్నప్పటికీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. పర్మిషన్ లేదు అని పోలీసులు చెప్పడంతో మనోజ్ రెచ్చిపోయాడు.
తాత సమాధుల వద్దకు వెళ్లేందుకు ఎవరి పర్మిషన్ అక్కర్లేదు, తానేమి గొడవ పడడానికి రాలేదు అంటూ మంచు మనోజ్ గేట్లు తియ్యమని అరుస్తూ రచ్చ చెయ్యడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది.