మంచు ఫ్యామిలీ వివాదం 2024 తో ఎంతగా హాట్ టాపిక్ అయ్యిందో అందరూ చూసారు. మంచు మనోజ్ మోహన్ బాబు, మంచు విష్ణు పై కేసులు పెట్టడం, ఆస్తితగాదాలు కాస్తా ప్రాణ హాని ఉంది అనే దగ్గరికి వెళ్లడం, మోహన్ బాబు రిపోర్టన్ ని కొట్టడం, అది కేసు దాకా వెళ్లడం ఇవన్నీ మంచు వ్యవహారంలో హైలెట్ కాగా.. మరోసారి మంచు వ్యవహారం మీడియాలో కనిపిస్తుంది.
తాజాగా మంచు మనోజ్ రంగంపేటకు బయలుదేరాడు. అక్కడ జరగబోయే జల్లికట్టులో మంచు మనోజ్ పాల్గొననున్నాడు. అక్కడనుంచి మంచు మనోజ్ మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్లనున్నాడు. ఇప్పటికే యూనివర్సిటీ వద్ద ఉన్న మోహన్ బాబు, మంచు విష్ణు. మళ్ళీ వారి మధ్యన వివాదం జరిగే అవకాశం ఉండడంతో అక్కడి పోలీసులు అలెర్ట్ అయ్యారు.
ఒకవేళ మనోజ్ మళ్ళీ మోహన్ బాబు, అలాగే విష్ణు తో గొడవపడితే ఆపేందుకు పోలీసులు కట్టుదిట్టమైం ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.