శంకర్ నుంచి రాబోయే మూవీస్ పై ఇప్పుడు అందరిలో నమ్మకం పోయింది. ఇండియన్ 2 డిజాస్టర్ తర్వాత ఆయన నుంచి వచ్చిన గేమ్ చెంజర్ కూడా అభిమానులను డిజప్పాయింట్ చేసింది. రామ్ చరణ్ తో శంకర్ చేసిన గేమ్ చెంజర్ అంచనాలను రీచ్ అవ్వలేకపోయింది. మెగా ఫ్యాన్స్ ను గేమ్ చెంజర్ రిజల్ట్ బాగా నిరాశపరిచింది. అయితే గేమ్ చెంజర్ విడుదలయ్యాక శంకర్ కమల్ తో చేసిన ఇండియన్ 3 మూవీ ని విడుదలయ్యాక చేద్దామనుకున్నారు.
ఇండియన్ 2 ఎఫెక్ట్ తో ఇండియన్ 3 డైరెక్ట్ ఓటీటీ అంటూ ప్రచారం జరిగినా గేమ్ చెంజర్ ప్రమోషన్స్ తో శంకర్ ఇండియన్ 3 థియేటర్స్ లోనే విడుదలవుతుంది అన్నారు. దానితో కమల్ అభిమానులు ఎగ్జైట్ అయ్యారు. ఇప్పుడు గేమ్ చెంజర్ వచ్చింది, అది కూడా అంచనాలు రీచ్ అవ్వలేదు.
దానితో ఇండియన్ 3 థియేట్రికల్ రిలీజ్ పై అనుమానాలు మొదలయ్యాయి. మరోపక్క కమల్ అభిమానులు ఇండియన్ 3 పై ఆశలొదిలేసుకోండి అంటున్నారు.