మహేష్ బాబు - రాజమౌళి కలయికలో జనవరి 2 న సీక్రెట్ గా మొదలైన మూవీ కి సంబందించిన ఓపెనింగ్ ఫోటో కానీ లేదంటే వీడియో కానీ వదల్లేదు. ఈ ఫెస్టివల్ కి ఏమైనా రాజమౌళి మహేష్ తో ఓపెనింగ్ పిక్ వదులుతారేమో అని మహేష్ ఫ్యాన్స్ చాలా ఆశపడ్డారు. కానీ సంక్రాంతి వహ్చేసింది, దాదాపుగా వెళ్ళిపోయింది అయినా మహేష్ తో రాజమౌళి సినిమా ఓపెనింగ్ పిక్ రాలేదు.
దానితో మహేష్ ఫ్యాన్స్ చాలా డిజప్పాయింట్ అయ్యారు. మరి రాజమౌళి ఇంత సీక్రెట్ గా ఎందుకు మైంటైన్ చేస్తున్నారో అనేది మహేష్ అభిమానులకే కాదు ప్యాన్ ఇండియా ప్రేక్షకులకు అర్ధం కావడం లేదు. ఒక్కసారి మహేష్ రాజమౌళి తో సెట్స్ లోకి వెళితే ఇక కనిపించారమేమో అని మహేష్ ఫ్యాన్స్ తో ఆందోళన కనిపిస్తుంది. మరి మహేష్ ఓ మూడునాలుగేళ్ళు రాజమౌళి సినిమాకి స్పెండ్ చెయ్యాల్సిందే.