నందమూరి బాలకృష్ణ-బాబీ కలయికలో తెరకెక్కిన డాకు మహారాజ్ జనవరి 12 న సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ టాక్ వచ్చినా ఆడియన్స్ అందులోను మాస్ ఆడియన్స్ నుంచి సినిమాకి మంచి టాక్ రావడంతో కలెక్షన్స్ పరంగా డాకు మహారాజ్ తో నిర్మాత నాగవంశీ కి లాభాలకు ఢోకా ఉండదనిపిస్తుంది.
తాజాగా డాకు మహారాజ్ సినిమాని బాపట్ల జిల్లా చీరాలలోని మోహన్ థియేటర్ లో బాలకృష్ణ సోదరి పురందరేశ్వరి కుటుంబ సభ్యులతో కలిసి తిలకించారు. డాకు మహారాజ్ చూసిన తర్వాత సామాజిక , సందేశాత్మక అంశాలతో పాటు బాలకృష్ణ నటన అద్భుతంగా ఉందని పురందేశ్వరి చిత్ర బృందానికి అభినందనలు తెలియజేసారు.