Advertisement
Google Ads BL

పవన్ ని పక్కనపెట్టాలంటున్న రాజేష్


మహాజన రాజేష్ ఎప్పుడు ఎవరికి ఫేవర్ గా మాట్లాడతాడో, లేదంటే ఎప్పుడు తన అనుకున్నవారిని తిడతాడో ఎవరికి ఓ పట్టాన అర్ధం కాదు. జనసేన-టీడీపీ కలిసి పోటీ చేసి గెలవడం రాజేష్ కి అస్సలు ఇష్టం లేదు. తనకి జనసేన వలనే ఎమ్యెల్యే సీటు దక్కలేదనే అసహనం రాజేష్ లో కనిపిస్తుంది. అందుకే జనసేన ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై ఇండైరెక్ట్ కామెంట్స్ చేస్తూ యూట్యూబ్ లో హడావిడి చేస్తూ ఉంటాడు.

Advertisement
CJ Advs

తాజాగా మహాసేన రాజేష్ మరోమారు పవన్ కళ్యాణ్ ని డిప్యూటీ సీఎం గా తప్పించి లోకేష్ ని డిప్యూటీ సీఎం గా చెయ్యాలంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు. నారా లోకేష్‌ను వెంటనే డిప్యూటీ సీఎం చేయాలి, 2024 ఎన్నికల ముందు నారా లోకేష్ చాలా కష్టాలు పడ్డాడు.. అవమానాలు పడ్డాడు, నారా లోకేష్ యువగళం పాదయాత్ర, అతను పడ్డ కష్టం వల్లే 134 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి

లోకేష్ అభిమానులుగా ఆయన్ని ఓ మినిస్టర్ గా మాత్రమే చూడడం మాకు నచట్లేదు, లోకేష్ ని త్వరగా డిప్యూటీ సీఎం ని చేయమంటూ డిమాండ్ చేస్తున్నాడు. మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ని ఏం చెయ్యాలని రాజేష్ ఉద్దేశ్యం, ఆయన్ని తప్పించి లోకేష్ కి ఆ సీటు కట్టబెట్టాలనేగా అతని డిమాండ్. 

Demand for making Lokesh a deputy CM:

Mahasena Rajesh has demanded to make minister Nnara Lokesh as deputy cm of the state
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs