పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కన్నా అల్లు అర్జునే తోపా.. ఇలా అంటే ప్రభాస్ ఫ్యాన్స్ పరిగెత్తించి కొడతారు. కానీ అది అన్నది మేము కాదు.. కాంట్రవర్సీ ఆస్ట్రాలజర్ వేణు స్వామి చేసిన కామెంట్స్. ఇండియాలో ఇద్దరే టాప్ స్టార్స్.. వారిలో ప్రభాస్ ఒకరు, అల్లు అర్జున్ మరొకరు. ప్రభాస్ కన్నా అల్లు అర్జున్ మార్కెట్ పెద్దది అంటూ వేణు స్వామి చేసిన కామెంట్స్ ఇప్పుడు వేడిని రగిల్చాయి.
ఈ మాటలు వేణు స్వామిని ప్రభాస్ ఫ్యాన్స్ చేతిలో అడ్డంగా బుక్ చేసాయి. రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణు స్వామి ఈ రకమైన కామెంట్స్ చేసారు. అల్లు అర్జున్ ఎదుగుదలను ఎవరు ఆపలేరు, ఆయనపై ఓ 20మంది నెగెటివ్ కామెంట్స్ పెడితే ఆయన ప్రతిష్ట దిగజారదు. ఆ ట్రోల్స్ ఆయన్ని మరింత ముందుకు నడిపిస్తాయి.
పుష్ప 1, పుష్ప 2 తో నేషనల్ హీరో కాదు ఇంటర్నేషనల్ హీరో అయ్యాడు. పుష్ప 2 పై యాంటీ ఫ్యాన్స్ ఒకరికి నేను ఫోన్ చేస్తే గురువుగారు పుష్ప సినిమాకెళ్లా అన్నారు, ఎలా ఉంది పుష్ప అని అడిగితే ఎక్కడా బోర్ కొట్టలేదు అన్నారు. అలాంటి సినిమాని ఎవరూ ఆపలేరు. అల్లు అర్జున్ ఇంకా ఇంకా ఎదుగుతాడు అని చెప్పే క్రమంలో ఆయన ప్రభాస్ మార్కెట్ పై చేసిన కామెంట్స్ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు