నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్. జనవరి 12 న విడుదలైన ఈ చిత్రానికి ఆడియెన్స్ ఇంకా క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ టాక్ వచ్చినా మాస్ ఆడియెన్స్ కి డాకు మహారాజ్ కనెక్ట్ అయ్యింది. అంతేకాదు నందమూరి ఫ్యాన్స్ అలాగే ఫ్యామిలీ ఆడియెన్స్ కి కూడా బాలయ్య డాకు కనెక్ట్ అవడంతో కలెక్షన్స్ కి డోక ఉండదనిపిస్తుంది.
డాకు మహారాజ్ తో కుర్ర హీరోలు సందడి చేశారు. అన్ స్టాప్పబుల్ తో బాలయ్య కు ఫ్రెండ్స్ గా మారిన విశ్వల్ సెన్ ఇంకా సిద్దు జొన్నలగడ్డ లు బాలయ్య తో కలిసి డాకూ మహారాజ్ ని వీక్షించారు.
డాకు మూవీని వీక్షించిన తరవాత బాలయ్యతో కలిసి సెల్ఫీ లతో సందడి చేసిన విశ్వక్ సెన్ బాలయ్య కు ముద్దులు పెడుతూ హంగామా చేశాడు. బాలయ్య ఊరుకుంటారా విశ్వక్ కి ముద్దు పెట్టేశారుఅది చూసిన నందమూరి ఫ్యాన్స్ డాకు మహారాజ్ తో సిద్దు, విశ్వాక్ సందడి అంటూ కామెంట్ చేస్తున్నారు.