ఈ ఆదివారం జనవరి 12 న రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల ముందుకు వచ్చిన నందమూరి బాలకృష్ణ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ డాకు మహారాజ్ మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. బాలయ్య మూడు రకాల వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో అదరగొట్టెయ్యడమే కాదు, ఆయన లుక్స్ కి నందమూరి ఫ్యాన్స్ సర్ ప్రైజ్ అవుతున్నారు.
అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి హ్యాట్రిక్ హిట్స్ తో తన ఎంటైర్ కెరీర్ లోనే ప్రైమ్ ఫార్మ్ లో కొచ్చిన బాలయ్య డాకు పెరఫార్మెన్స్ చూసి మాస్ ఆడియన్స్ సూపర్ అంటున్నారు. ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ ని దించి బాలయ్య మంచి పని చేసారు. నార్మల్ డేస్ లో వస్తే రిజల్ట్ ఎలా ఉండేదో.. కానీ సంక్రాంతి పండగ హెల్ప్ అయ్యింది.
బాలకృష్ణ కు సంక్రాంతి బాగా కలిసోస్తుంది. గతంలో సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, లక్ష్మి నరసింహ ఇప్పడు డాకు మహారాజ్ అంటూ నందమూరి అభిమానులు మాట్లాడుకుంటుంటే మాస్ ఆడియెన్స్ మాత్రం డాకులో బాలయ్య యాక్షన్ ని చూసెయ్యాల్సిందే అంటూ మాట్లాడుకోవడం డాకు మహారాజ్ కల్లెక్షన్స్ పెరగడానికి కారణమయ్యేలా ఉంది. చూద్దాం డాకు పెరఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అనేది.