ఆర్.ఆర్.ఆర్ తర్వాత గ్లోబల్ ట్యాగ్ తో ఎన్టీఆర్ ని, రామ్ చరణ్ ని అభిమానులే కాదు పాన్ ఇండియా ప్రేక్షకులు కూడా ఓన్ చేసుకున్నారు. ఆర్.ఆర్.ఆర్ కన్నా ముందే కోలీవుడ్ శంకర్ తో గేమ్ చేంజర్ అనౌన్స్ చేసి సెట్స్ లోకి వెళ్ళిపోయిన రామ్ చరణ్ ఆ చిత్రాన్ని ఆర్.ఆర్.ఆర్ విడుదలైన మూడేళ్లకు విడుదల చేసి ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు.
ఇక ఎన్టీఆర్ కూడా దేవర తో ఆర్.ఆర్.ఆర్ తర్వాత రెండున్నర ఏళ్లకు ఆడియన్స్ ముందుకు రాగా ఆ చిత్రానికి ప్రేక్షకులు, క్రిటిక్స్ అందరూ ఓవరాల్ గా మిక్స్డ్ రెస్పాన్స్ చూపించారు, మొదటి రోజు దేవర చిత్రానికి వచ్చిన టాక్ చూస్తే ఎన్టీఆర్ కెరీర్ లో డిజాస్టర్ ఖాయమన్నారు. కానీ ఆర్.ఆర్.ఆర్ క్రేజ్ తో వచ్చిన ఎన్టీఆర్ స్టామినా కారణంగా దేవర 500 కోట్ల క్లబ్బులో నిలిచింది.
ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ చేంజర్ కు కూడా సేమ్ దేవర కొచ్చిన టాక్ రావడం ఆశ్చర్యకర విషయం. గేమ్ చెంజర్ కి క్రిటిక్స్ తో పాటుగా ప్రేక్షకులు కూడా మిక్స్డ్ రెస్పాన్స్ చూపిస్తున్నారు. కామన్ ఆడియన్స్ గేమ్ చేంజర్ బాలేదు అంటూ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ మాదిరి చరణ్ కూడా తన స్టామినా ప్రూవ్ చేసుకోవాల్సిన అగత్యం ఏర్పడింది.
గేమ్ చేంజర్ కి హిట్ టాక్ వస్తే కలెక్షన్స్ అదిరిపోయేవి. కానీ ఇక్కడ యావరేజ్ టాక్ రావడంతో రామ్ చరణ్ స్టామినా గేమ్ చెంజర్ కలెక్షన్స్ పెరగడానికి హెల్ప్ అవుతుందా.. లేదా అనేది ఇప్పడు ఇంట్రెస్టింగ్ గా మారింది.