రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రానికి మినిమమ్ బజ్ లేకపోవడం అనేది మెగా ఫ్యాన్స్ కు మింగుడుపడని విషయమే. పాన్ ఇండియాలోని పలు థియేటర్స్ లో గేమ్ చేంజర్ చూసేందుకు ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించకపోవడం నిజంగా షాకింగ్ విషయమే. చాలా నగరాల్లో గేమ్ చేంజర్ థియేటర్స్ ఖాళీ.
అంతెందుకు రామ్ చరణ్ స్పెషల్ గా గేమ్ చేంజర్ వీక్షించిన థియేటర్ లో జనాలు లేకపోవడమే కాదు.. సినిమా వస్తున్నప్పుడు ప్రేక్షకులు సినిమా చూడకుండా ఫోన్ చూడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి గేమ్ చెంజర్ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. ఆ కలెక్షన్స్ పోస్టర్ ఏమిటి.
ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో చరణ్, గేమ్ చేంజర్ పై కనిపిస్తోన్న ట్రోలింగ్. మొదటిరోజు గేమ్ చేంజర్ 186 కోట్ల షేర్ సాధించింది అంటూ మేకర్స్ వదిలిన పోస్టర్ చూసి చాలామంది కామెడీగా నవ్వుకుంటున్నారు. సోషల్ మీడియా లో అలా, థియేటర్స్ లో ఇలా.. ఈ కలెక్షన్స్ ఎలా అంటూ నెటిజెన్స్ వెటకారంగా మాట్లాడుతున్నారు.