అక్కిని యూత్ మొత్తం అందులోను కొత్తగా ఎంటర్ అయిన కోడలు శోభిత దూళిపాళ్లతో కలిసి కనిపిస్తే అది అక్కినేని అభిమానులకే కాదు సినీప్రియులందరికి పండగే. అక్కినేని యూత్ లో నాగ చైతన్య దగ్గర నుంచి సుమంత్ వరకు, కొత్త కోడలు శోభిత దూళిపాళ్ల అందరూ ఒకే ఫ్రేమ్ లో కనబడితే నిజంగా అది ఫుల్ ఫిల్ అయినట్లే.
డిసెంబర్ 5 న నాగ చైతన్య జీవితంలోకి అడుగుపెట్టిన శోభిత దూళిపాళ్ల అక్కినేని ఫ్యామిలీతో మమేకమైంది. సుప్రియ, సుశాంత్, సుమంత్, చైతు ఇంకా అక్కినేని మిగతా అమ్మాయిలు, అబ్బాయిలు ఈ ఫ్రేమ్ లో కనిపించినా అఖిల్ కనిపించకపోవడం అక్కినేని అభిమానులను డిజప్పాయింట్ చేసింది.
అంటే అఖిల్ అక్కినేని కొత్త చిత్రాన్ని మొదలు పెట్టి సైలెంట్ గా షూటింగ్ చేసుకుంటున్నాడో.. లేదా అఖిల్ తన ఫియాన్సీ తో ఎక్కడికైనా వెకేషన్ కి వెళ్ళాడో అనేది ఇప్పుడు అభిమానుల అనుమానం.