అల్లు అర్జున్ టెన్షన్ ఫ్రీ అయ్యారు. గత నెల రోజులుగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో సఫర్ అయిన అల్లు అర్జున్ ఎట్టకేలకు రెండు రోజుల క్రితమే ముంబై వెళ్లి సంజయ్ లీల భన్సాలీని కలిసి వచ్చారు.ముంబై నుంచి వచ్చాక తండ్రి అల్లు అర్జున్ బర్త్ డే ని ఇంట్లోనే ఫ్యామిలీ మెంబెర్స్ నడుమ గ్రాండ్ గా నిర్వహించారు.
ఇక ఈరోజు అల్లు అర్జున్ కాస్త టెన్షన్ ఫ్రీ అయ్యే న్యూస్ ఒకటి బయటికొచ్చిది. అది అల్లు అర్జున్ వారం వారం ఇకపై చిక్కడ పల్లి పోలీసుస్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం లేదు.
చిక్కడపల్లి పోలీసుల ముందు విచారణకు హాజరుకావాలన్న నిబంధన నుండి మినహాయింపు ఇవ్వడమే కాకుండా విదేశాలకు వెళ్లేందుకు అల్లు అర్జున్ కు కోర్టు అనుమతి ఇచ్చింది. రేపు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు విచారణకు హాజరు కావాల్సి ఉన్న సమయంలోనే ఇలాంటి తీర్పు రావడంతో అల్లు అర్జున్ కి ఊరట లభించినట్లయ్యింది.