అక్కినేని ఇంటికి కొత్త కోడలిగా డిసెంబర్ 5 న అడుగుపెట్టిన శోభిత దూళిపాళ్ల పెళ్లి తర్వాత భర్త చైతు తో కలిసి హనీమూన్ ట్రిప్స్ ప్లాన్ చేసుకోకుండా వర్క్ లో బిజీ అయ్యింది. నాగ చైతన్య కూడా పెళ్లి తంతు పూర్తి కాగానే ముంబై వెళ్ళాడు, అలాగే తండేల్ కి సంబందించిన పనులు, కార్తీక్ దండు తో సినిమా ఫైనల్ చేసుకోవడం ఇలా తన పనిలో తాను ఉన్నాడు.
ఇక శోభిత దూళిపాళ్ల పెళ్లయ్యింది కదా అని పక్కన కూర్చోకుండా సోషల్ మీడియాలో తన లేటెస్ట్ లుక్స్ వదులుతుంది. తాజాగా శోభిత బ్లాక్ సూట్ లో వదిలిన నయా లుక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పెళ్లి తర్వాత చీర కట్టినా, మోడ్రెన్ డ్రెస్ వేసినా శోభిత ఎక్కువగా వైరల్ అవుతోంది.
ఒకప్పుడు తెలుగులో ఆమె ప్రభావం కనిపించకపోయినా అక్కినేని కోడలిగా మారాక మాత్రం సోషల్ మీడియాలో తెలుగు నుంచి స్పెషల్ గా ట్రెండ్ అవుతుంది. ప్రస్తుతం శోభిత దూళిపాళ్ల హిందీ ప్రాజెక్ట్స్ విషయంగా ముంబై లో ఉంది.