రామ్ చరణ్-శంకర్ కాంబోలో జనవరి 10 న పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకు వచ్చిన గేమ్ చేంజర్ చిత్రనికి ఎక్స్ట్రార్డనరీ టాక్ రాకపోయినా మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది. మెగా ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ ఓకె ఓకే.. ఇంటర్వెల్ బ్లాక్ అదుర్స్.. సెకండ్ హాఫ్ బావుంది, రామ్ చరణ్ పెరఫార్మెన్స్ అదుర్స్ అంటున్నా.. కామన్ ఆడియన్స్ కు మాత్రం గేమ్ చెంజర్ అంతగా ఎక్కలేదు.
ఇక తాజాగా థియేటర్స్ లో విడుదలైన గేమ్ చేంజర్ ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా.. గేమ్ చేంజర్ డిజిటల్ హక్కులను ఫ్యాన్సీ డీల్ తో ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు పాన్ ఇండియా లాంగ్వేజ్ రైట్స్ దక్కించుకోగా.. అదే విషయాన్ని గేమ్ చేంజర్ టైటిల్ కార్డ్స్ లోనే రివీల్ చేసారు మేకర్స్.
సో థియేట్రికల్ రన్ ముగియగానే అమెజాన్ ప్రైమ్ ఓటీటీ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ ముందుకు రానుంది రామ్ చరణ్ గేమ్ చేంజర్.