నిన్న గాక మొన్న రకుల్ ప్రీత్ జిమ్ లో గాయపడి ఎనిమిదివారాల పాటు బెడ్ రెస్ట్ లో ఉంటే.. ఇప్పుడు నేషనల్ క్రష్ రష్మిక కూడా జిమ్ లో గాయపడడం ఆమె అభిమానులను ఆందోళనకు గురి చేసింది. పుష్ప 2 సక్సెస్ తర్వాత కుబేర, సికిందర్ సినిమా షూటింగ్స్ లో బిజీ అయిన రష్మిక తాజాగా జిమ్ లో ప్రమాదానికి గురైనట్టుగా తెలుస్తోంది.
జిమ్ లో గాయపడిన రష్మిక డాక్టర్ ని సంప్రదించగా.. వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించి, కొద్ది రోజులు ఆమెను రెస్ట్ తీసుకోవాలని సూచించారట. దానితో రష్మిక కొన్నాళ్ళు సినిమా షూటింగ్ కి దూరంగా ఉండాల్సి వస్తుందట. రష్మిక ఫిట్నెస్ ఫ్రీక్. ఆమె చిన్న ఖాళీ సమయం దొరికినా జిమ్ చేస్తుంది.
ఫిట్ గా ఉండేందుకు రష్మిక మందన్న జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ.. యోగ చేస్తూ ఫిట్ గా అందంగా ఉంటుంది. ప్రస్తుతం రష్మిక చేతిలో తమిళ, హిందీ మూవీస్ ఉన్నాయి. క్షణం తీరిక లేకుండా రష్మిక షూటింగ్స్ లో పాల్గొంటుంది. ఇప్పుడు జిమ్ ప్రమాదంతో ఆమె షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.