నందమూరి అభిమానులకు ఏదో ఒక మూలన డాకు మహారాజ్ విషయంలో ఆందోళన ఉన్నా ఇప్పుడు ఆ ఆందోళన స్థానంలో ఆనందం కలుగుతుంది. కారణం డాకు మహారాజ్ ఫస్ట్ ట్రైలర్ విషయంలో వచ్చిన ఫీడ్ బ్యాక్ తో వారు ఆందోళన పడిపోయారు. డాకు మహారాజ్ ఫస్ట్ ట్రైలర్ విషయంలో నందమూరి ఫ్యాన్స్ అసంతృప్తిగానే ఉన్నారు. మహాశివరాత్రి కి వచ్చిన గ్లిమ్ప్స్ తో పోలిస్తే ఆ తర్వాత వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంతగా ఆడియెన్స్ కి ఎక్కలేదు.
మరోపక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవడంతో అభిమానులు డిజప్పాయింట్ అయ్యారు. అందుకే మేకర్స్ ఈరోజు శుక్రవారం డాకు మహారాజ్ నుంచి రెండో ట్రైలర్ వదిలారు. డాకు సెకండ్ ట్రైలర్ మొత్తం యాక్షన్ తో నిండిపోవడమే కాదు బాలయ్య మాస్ లుక్, విలన్ బాబీ డియోల్ లుక్స్ అన్ని అభిమానులను బాగా ఇంప్రెస్స్ చేసాయి.
బాలయ్య డైలాగులు అభిమానులనే కాదు మాస్ ఆడియన్స్ నుంచి ఈలలు వేయించేలా ఉన్నాయి. యాక్షన్ సీన్స్ అయితే నెక్ట్స్ లెవల్, ఇప్పటివరకు ఒక ఎత్తు డాకు రెండో ట్రైలర్ వచ్చాక సినిమాపై పెరిగిన అంచనాలు మరో ఎత్తు అనేలా ఉందా ట్రైలర్, ఇక థమన్ BGM వేరే లెవల్ అంటూ అభిమానులు రిలాక్స్ అవుతున్నారు.