కింగ్ నాగార్జున ఈ వయసులోను నవమన్మధుడిలా మెరిసిపోతారు. ఆయన ఫిట్ నెస్ చూస్తే కుర్ర హీరోలకు అసూయ కలుగుతుంది. అంత హ్యాండ్ సమ్ గా, ఫిట్ గా నాగార్జున కనిపిస్తారు. ఇప్పటికి అమ్మాయిలకు నాగార్జున కలల రాకుమారుడే. నాగార్జున అంత ఫిట్ గా ఉండేందుకు ఏం తింటారు, ఎలాంటి వర్కౌట్స్ చేస్తారు అనే విషయంలో చాలామందికి క్యూరియాసిటీ ఉంది
రీసెంట్ గా నాగార్జున తన డైట్ సీక్రెట్ రివీల్ చేసారు. రోజు ఉదయం లేవగానే ఓ గంట వాకింగ్, ఆతర్వాత జిమ్ లో మరో గంట వర్కౌట్స్ చేస్తాను, వారానికి ఐదు లేదా ఆరు రోజులపాటు వాకింగ్, వర్కౌట్స్ అనేది ఖచ్చితంగా చేస్తాను. అలాగే లేవగానే ఓ గ్లాస్ హాట్ వాటర్, ఓ కాఫీ తాగాక వాకింగ్ వెళ్ళిపోతాను అని చెప్పిన నాగార్జున తర్వాత తాను తినే డైట్ ఎలా ఉంటుందో చెప్పుకొచ్చారు.
ప్రోబయోటిక్స్ తీసుకుంటాను, సాయంత్రం 7 లేదా 7.30 కి నా డిన్నర్ పూర్తి చేస్తాను, ఓ 12 గంటల ఉపవాసం చేస్తాను, అంతేకాదు అప్పుడప్పుడు ఉపవాసం కూడా ఉంటాను. ఇక సండే నా చీటింగ్ డే. ఆ రోజు నాకు నచ్చినవి ముఖ్యంగా హైదరాబాద్ దమ్ బిర్యానీ, ఇంకా తినడం, తాగడం వంటివి చేస్తాను.
తినాలా వద్ద అనే ఆలోచన లేకుండా ఆదివారం నాకు ఇష్టమైనవన్నీ లాగించేస్తాను. అప్పడు దేనిని మనం వదిలేశామనే ఫీలింగ్ రాదు గత 30 ఏళ్ల నుండి నేను ఇదే ఫాలో అవుతున్నా అంటూ నాగార్జున తన డైట్ సీక్రెట్ బయటపెట్టారు.