గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ నేడు జనవరి 10 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఆర్.ఆర్.ఆర్ లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న గేమ్ చేంజర్ పై అంచనాలు ఎలా ఉండాలి, కానీ సినిమా విడుదలకు ముందు గేమ్ ఛేంజర్ పై ప్రేక్షకుల్లో అసలు ఇంట్రెస్ట్ కనిపించలేదు. కారణం ప్రమోషన్స్.
తెలుగు, హిందీ, తమిళంలోనే గేమ్ ఛేంజర్ విడుదల అంటూ మేకర్స్ చెప్పడంతో అటు మలయాళం, ఇటు కన్నడ ఆడియన్స్ గేమ్ ఛేంజర్ ని లైట్ తీసుకున్నారు. మెగా ఫ్యాన్స్ హడావిడి చేసినా గేమ్ చేంజర్ పై బజ్ క్రియేట్ చేయలేకపోయారు. ఈరోజు విడుదలైన గేమ్ ఛేంజర్ బెంగుళూర్ థియేటర్స్ ఖాళీగా కనిపించడమే దానికి ఉదాహరణ.
తెలుగులో భారీగా బుకింగ్స్ కనిపించినా ఇతర లాంగ్వేజెస్ లో గేమ్ చెంజర్ బుకింగ్స్ చాలా వీక్ గా ఉన్నాయనేది మాత్రం సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. ఈరోజు ఉదయం 6.30 గంటలకి గేమ్ చేంజర్ విడుదలైన బెంగుళూరు థియేటర్స్ లో ఇలా ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. మరి తెలుగు, తమిళం ఓకె మిగతా లాంగ్వేజెస్ గేమ్ చేంజర్ పెరఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి.