అల్లరి నరేష్ నాంది చిత్రంతో ఫామ్ లోకి వచ్చిన తర్వాత ఆయన నటించిన సినిమాలు ఏవి ప్రేక్షకులను ఇంప్రెస్స్ చెయ్యలేకపోతున్నాయి. కామెడీ వదిలేసి జోనర్ మార్చిన అల్లరి నరేష్ గత ఏడాది డిసెంబర్ లో బచ్చల మల్లి తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
బచ్చల మల్లి చిత్రాన్ని దర్శకుడు మంగదెవ్వి కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. కానీ ఈ చిత్రం థియేటర్స్ లో సో సో టాక్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక బచ్చల మల్లి చిత్రం విడుదలకు ముందే మూడు ఓటీటీ సంస్థలు ఓటీటీ పార్ట్నర్స్ గా నిలిచాయి. అమెజాన్ ప్రైమ్, సన్ నెక్స్ట్, ఈటివి విన్ వారు బచ్చలమల్లి ఓటీటీ హక్కులను దక్కించుకున్నారు.
జనవరి 10 నుంచే అంటే ఈరోజు నుంచే బచ్చలమల్లి చిత్రం స్ట్రీమింగ్ కి వస్తున్నట్టుగా ఈటివి విన్ వారు ప్రకటించారు. థియేటర్స్ లో మిస్ అయ్యినవారు ఈటీవీ విన్ లో చూడొచ్చు.