గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-శంకర్ కలయికలో నేడు భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ ఏపీలో 1 గంట షోస్, తెలంగాణాలో 4 గంటల షోస్ పూర్తవడమే కాదు అటు ఓవర్సీస్ లోను గేమ్ ఛేంజర్ గేమ్ పూర్తయ్యింది. మరి మెగా ఫ్యాన్స్, ఆడియన్స్ ఆగుతారా గేమ్ ఛేంజర్ లెక్కలు తేల్చేస్తూ ట్విట్టర్ పై పడ్డారు.
గేమ్ ఛేంజర్ ప్రీమియర్స్ టాక్ లోకి వెళితే గేమ్ ఛేంజర్ సినిమా ఫస్టాఫ్ లో చాలా వరకు యావరేజ్‌గా ఉంది. ఇంటర్వెల్ ట్విస్టు మాత్రం హైలెట్.. అంటూ ఓ ఆడియెన్ ట్వీట్ చేస్తే, ఫస్టాప్ గ్రాండియర్‌గా, ఎమోషనల్‌గా, యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో రాంచరణ్ ఇంప్రెస్ చేశాడు.. అంటూ మరో నెటిజెన్ స్పందించాడు.
గేమ్ ఛేంజర్ అంటూ అప్పన్న పాత్రలో ఓ ఎమోషనల్ షాట్ అందరికి షాకిస్తుంది. ఆ షాట్‌లో నటనకు రాంచరణ్ నేషనల్ నటుడు అవార్డు పక్కా, ఇండియన్ 2 ఎఫెక్ట్ తో శంకర్.. గేమ్ ఛేంజర్ సినిమాను కసితో తీశాడు. సినిమా సెకండాఫ్ మాత్రం నెవ్వర్ బిఫోర్ అనే విధంగా ఉంది అంటూ ఓ మెగా ఫ్యాన్ ట్వీట్‌ను వేశారు.
థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కావాల్సిన దాని కంటే ఎక్కువ గోల ఉంది. శంకర్ డైరెక్షన్ అస్సలు బాగాలేదు. కార్తీక్ సుబ్బరాజ్ స్టోరీ కూడా గొప్పగాలేదు. స్క్రీన్ ప్లే కూడా అంతంత మాత్రమే.. అంటూ కొందరు స్పందిస్తే మరికొందరు గేమ్ ఛేంజర్ సినిమా మాస్, ఊరమాస్. రామ్ నందన్ ఊచకోత మొదలు అంటూ సోషల్ మీడియాలో రచ్చ మొదలు పెట్టేసారు.