ఈమధ్యన సినీ హీరోల ఫంక్షన్స్ అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నిర్వహించడానికి మేకర్స్ నానా తంటాలు పడుతున్నారు. అనుకున్న దానికన్నా ఎక్కువగా అభిమానులు రావడం, ఈవెంట్ దగ్గర గందరగోళం జరగడం అన్ని చూస్తున్నాం. ఎన్టీఆర్ దేవర చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయలో నోవెటెల్లో ఈవెంట్ ఏర్పాటు చేస్తే అక్కడికి లెక్కకు మించి అంటే ఏడు వేల కెపాసిటీ ఉన్న హాల్ దగ్గరకు 30 వేలమంది రావడంతో ఆ ఈవెంట్ అర్ధాంతరంగా క్యాన్సిల్ చేసారు.
అక్కడ ఎలాంటి గందర గోళం జరక్కముందే ఈవెంట్ క్యాన్సిల్ చేశారు, ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయినా మేకర్స్ వెనక్కి తగ్గలేదు, ఆతర్వాత పుష్ప 2 ఈవెంట్ పోలీస్ గ్రౌండ్స్ లో జరగగా అక్కడ ఫ్యాన్స్ చనిపోకపోయినా, తొక్కిసలాట జరిగి పలువురు గాయాలపాలయ్యారు.
ఇప్పుడు తిరుపతి లో జరిగిన తొక్కిసలాట ఘటనతో బాలయ్య డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేసారు. లోకేష్ అతిధిగా అనంతపురంలో డాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉంది. కానీ తిరుపతి ఘటన వలన మేకర్స్ ఈవెంట్ క్యాన్సిల్ చేసారు. నందమూరి అభిమానులు ఈ విషయంలో చాలా డిజప్పాయింట్ అయ్యారు. అయినా బాలయ్య వెనక్కి తగ్గలేదు.
మొన్న దేవర ఈవెంట్ క్యాన్సిల్ అవడం, ఇప్పుడు డాకు మహారాజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవడంతో నందమూరి అభిమానులు చాలా నిరాశపడిపోయారు.