టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ పెళ్లి కొడుకు ప్రభాస్ పెళ్లి పై ఆయన అభిమానుల్లోనే కాదు కామన్ ఆడియన్స్ లోను విపరీతమైన క్యూరియాసిటీ కనిపిస్తుంది. ప్రభాస్ మాత్రం సినిమాలు చేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు కానీ పెళ్లి పేరు ఎత్తరు. ఆయన పెద్దమ్మ శ్యామలాదేవి ప్రభాస్ పెళ్లిపై అప్పుడప్పుడు మాట్లాడుతున్నా ఆ పెళ్లి కార్యరూపం దాల్చడం లేదు.
తాజాగా ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్ రామ్ చరణ్ ను అన్ స్టాపబుల్ టాక్ షో లో బాలయ్య నాకెప్పటినుంచొ ఒక డౌట్. ఆ డౌట్ కి ఎక్కడా ఆన్సర్ దొరకడం లేదు, నీకొక్కడికే ప్రపంచంలో ఆన్సర్ తెలుసు అనుకుంటున్నాను అడగనా అంటూ... ప్రభాస్ పెళ్లెప్పుడమ్మా అని అడిగేసారు. దానికి రామ్ చరణ్ ఇచ్చిన ఆన్సర్ చూస్తే నిజంగా నవ్వు రావడం మాత్రం ఖాయం. అంత ఫన్నీ ఆన్సర్ ఇచ్చారు చరణ్.
మీ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ని అడగండి సర్ అన్నాడు చరణ్. ప్రభాస్ చేసుకోబోయేది భీమవరం అమ్మాయా, లేదంటే గణపవరం అమ్మాయా అన్నారు బాలయ్య. నాకు మతిమరుపు సర్.. నాకు ప్రభాస్ చెప్పాడు కానీ మర్చిపోయాను అంటూ చరణ్ ప్రభాస్ పెళ్లిపై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.