నందమూరి అభిమానులకు డాకు మహారాజ్ మేకర్స్ బ్యాడ్ న్యూస్ అందించారు. కారణం డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు అనంతపురంలో ప్లాన్ చేసి చీఫ్ గెస్ట్ గా మినిస్టర్ నారా లోకేష్ ను ఆహ్వానించారు, కానీ ఇప్పుడు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాల టికెట్స్ జారి చేసే క్యూ లైన్ లో జరిగిన తొక్కిసలాటలో పలువురు భక్తులు మృతి చెందారు.
చాలామంది భక్తులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దానితో అనంతపురంలో జరగాల్సిన డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని రద్దు చేస్తున్నట్టుగా డాకు మహారాజ్ మేకర్స్ ప్రకటించారు. మరి ఇది నందమూరి అభిమానులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇప్పటివరకు బాలయ్య డాకు మహారాజ్ ఈవెంట్స్ తో అభిమానుల ముందుకు రాలేదు.
రీసెంట్ గా అమెరికా డల్లాస్ పురంలో డాకు మహారాజ్ ఈవెంట్ నిర్వహించారు కానీ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో డాకు మహారాజ్ ఈవెంట్స్ జరపలేదు, ఈరోజు జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా రద్దయ్యేసరికి నందమూరి అభిమానులు చాలా డిజప్పాయింట్ అవుతున్నారు.