మీనాక్షి చౌదరికి మహేష్ గుంటూరు కారంలో సెకండ్ హీరోయిన్ పాత్ర వచ్చేసరికి ఆమె ఎంతగా పొంగిపోయిందో తెలియదు కానీ.. కానీ మీనాక్షి ఉత్సాహం పై నీళ్లు చల్లుతూ త్రివిక్రమ్ చాలా డిజప్పాయింట్ చేసారు. ఆ సినిమా తర్వాత మీనాక్షి చౌదరి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ GOAT చిత్రంలో ఛాన్స్ రావడంతో ఆమె లక్కీ గర్ల్ అంటూ అందరూ పొగిడేశారు.
కానీ విజయ్-వెంకట్ ప్రభు GOAT రిజల్ట్ మీనాక్షిని నిరాశపరిచింది అనే కన్నా ఆమెను డిప్రెషన్ లోకి నెట్టేసిన విషయం మీనాక్షి చౌదరి తాజాగా సంక్రాంతికి వస్తున్నాం అంటూ ఇస్తున్న ఇంటర్వూస్ లో బయటపెట్టింది. GOAT చిత్రంలో మీనాక్షి చౌదరి పాత్ర పై మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడిచింది.
ఆ ట్రోలింగ్ తో మీనాక్షి చౌదరి దాదాపు వారం రోజులపాటు డిప్రెషన్ కి లోనై చాలా ముభావంగా ఒంటరిగా నరకం చూసినట్లుగా చెప్పుకొచ్చింది. ఆ తర్వాత లక్కీ భాస్కర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తనకి బిగ్ రిలీఫ్ ఇచ్చినట్లుగా, విజయ్ GOAT తో చాలా సుఫర్ అయినట్లుగా ఆమె చెప్పుకొచ్చింది.
ఆతర్వాత కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా మీనాక్షి చౌదరి సంక్రాంతికి వస్తున్నాం ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.