మెగా ఫ్యాన్స్ ఇప్పటి వరకు గేమ్ చేంజర్ అప్ డేట్స్ విషయంలో ఎంతటి అసంతృప్తిగా ఉన్నా ప్రస్తుతం గేమ్ ఛేంజర్ పై మెగాస్టార్, సుకుమార్ లాంటి వాళ్ళు పెంచుతున్న హైప్ తో వారు చాలా కాన్ఫిడెంట్ తో కనిపిస్తున్నారు. మరోపక్క ఈ సంక్రాంతి సినిమాల విషయంలోనూ మెగా ఫ్యాన్స్ చేస్తున్న ట్వీట్స్ చూసి నెటిజెన్స్ నవ్వుకుంటున్నారు.
ఇండియన్ 2 తో డిజప్పాయింట్ అయిన శంకర్ కి హిట్ ఇస్తున్నాము, అని ముందే చెప్పాము, హిట్ ఇస్తున్నాము, హైప్ లేని మూవీ తో
రామ్ చరణ్ పెట్టే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ కి సగం మంది ఈ సంక్రాంతికి నిద్రలు ఉండవు @AlwaysRamCharan మాస్ జాతర చూస్తారు అంటూ ట్వీట్లు వెయ్యడమే కాదు..
ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్న సినిమాల్లో
#GameChanger ≈ 500cr Gross
#DakuMaharaaj ≈ 140cr Gross
#SankranthikiVasthunam ≈ 80cr Gross సాధిస్తాయంటూ వారు వేస్తున్న ట్వీట్స్ కి నెటిజెన్స్, కామన్ ఆడియన్స్ అందరూ వచ్చాడండి సౌత్ తరణ్ ఆదర్శ్, అవునవును గేమ్ ఛేంజర్ పొతే ఈ సంక్రాంతికి మీకు నిద్ర ఉండదు అంటూ కామెడీగా కామెంట్స్ చేస్తున్నారు.