మెగా ఫ్యామిలీలోకి చిన్న కోడలిగా నాగబాబు ఇంట అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠి.. గత ఏడాది కాలంగా ఏ సినిమా షూటింగ్ లోను పాల్గొనలేదు. చక్కగా కోడలిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తుంది, భర్త వరుణ్ తేజ్ తో కలిసి ఎంజాయ్ చేస్తుంది. రీసెంట్ గానే క్రిస్టమస్, న్యూ ఇయర్ వేడుకలను మెగా ఫ్యామిలీ కజిన్స్ తో కలిసి సెలబ్రేట్ చేసుకుంది.
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన కొత్త లుక్స్ పరిచయం చేస్తూ చక్కటి సాంప్రదాయ లుక్స్ షేర్ చేస్తుంది. తాజాగా లావణ్య త్రిపాఠి శారీ లుక్ షేర్ చేసింది. రాయల్ గా లావణ్య ఇచ్చిన ఫోజులు ఆమె అభిమానులను బాగా ఇంప్రెస్స్ చేసాయి. పెళ్ళయ్యాక పద్దతిగా లావణ్య ఆకట్టుకుంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అన్నట్టు లావణ్య త్రిపాఠి 2025 ఏడాదిని కొత్తగా ప్రారంభించబోతుంది. తన యాక్టింగ్ ని కంటిన్యూ చేస్తూ కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టింది. దానికి సంబందించి పూజా కార్యక్రమాలను కూడా జరిపించారు. అతి తొందరలోనే లావణ్య సెట్స్ మీదకి వెళ్లనుంది.