నిజంగా విక్టరీ వెంకటేష్ ని యంగ్ హీరోలెవరు మ్యాచ్ చెయ్యలేరు. ఇది నిజం. ఈవయసులోను ఆయనలోని ఎనర్జీ చూస్తే అదే చెబుతారు. మరో వారం రోజుల్లో సంక్రాంతికి వస్తున్నాం అంటూ ఈ సంక్రాంతి ని టార్గెట్ చేసిన వెంకీ ఆ సినిమా ప్రమోషన్స్ ఫుల్ జోష్ లో పాల్గొనడమే కాదు యూత్ లా రీల్స్ చేస్తూ హంగామా చేస్తున్నారు.
యంగ్ హీరోలు కూడా వెంకీని మ్యాచ్ చెయ్యని విధంగా వెంకటేష్ ప్రమోషన్స్ లో దూసుకుపోతున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్స్ ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలను వెంట పెట్టుకుని స్టేజ్ పై డాన్స్ చెయ్యడం, తన పాత సినిమాల కంటెంట్ తో రీల్స్ చేస్తూ ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడం అన్ని కొత్తగా ప్రేక్షకులను రీచ్ అవుతున్నాయి.
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలయ్య డాకు మహారాజ్ రెండు సినిమాల ప్రమోషన్స్ సంక్రాంతికి వస్తున్నాం ప్రమోషన్స్ ముందు దిగడుపు అనేలా ఉన్నాయి. కారణం వెంకీ మామ అంటే అతిశయోక్తి కాదు.