నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ఆహా అన్ స్టాపబుల్ టాక్ షో నాలుగో సీజన్ రామ్ చరణ్ ఎపిసోడ్ తో ముగుస్తుంది. రామ్ చరణ్ సీజన్ 4 చివరి గెస్ట్ గా బాలయ్యతో ఈ షో లో సందడి చేసారు. అయితే గత మూడు సీజన్స్ లో కానీ, ఈ సీజన్ లో కానీ బాలయ్య షోకి మెగాస్టార్ చిరు వస్తారని అటు మెగా ఫ్యాన్స్, ఇటు నందమూరి అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
కానీ ఈ నాలుగు సీజన్స్ లో చిరు కనిపించలేదు, అలాగే మరో నందమూరి హీరో కూడా బాలయ్య టాక్ షో కి రావాలని నందమూరి అభిమానులు బలంగా కోరుకున్నారు. ఆయన యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆహా అన్ స్టాపబుల్ టాక్ షో లో బాలయ్య తో కలిసి ఎన్టీఆర్ ని చూడాలనేది కామన్ ఆడియన్స్ కూడా కోరుకున్నారు.
గత మూడు సీజన్స్ లో ఎన్టీఆర్ ఆహా టాక్ షోలో బాబాయ్ బాలయ్య తో కలిసి సందడి చేస్తే బావుంటుంది, ఇద్దరు కలిసి కనిపిస్తారనుకుంటే అది సాధ్యమవ్వలేదు, కనీసం ఈ సీజన్ అయినా ఎన్టీఆర్-బాలయ్య కలయికను ఎక్స్పెక్ట్ చేస్తే ఈ సీజన్ కూడా ముగిసింది.
అసలు ఎన్టీఆర్-చిరు బాలయ్య టాక్ షోకి వస్తారా, అది సాధ్యమయ్యేనా అంటూ చాలామంది మాట్లాడుకోవడం ఆహా అరవింద్ గారి వద్దకు వెళ్ళదంటారా చూద్దాం ఏమవుతుందో అనేది.