నిన్నమొన్నటివరకు కిస్సిక్ బ్యూటీ శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ పై రకరకాల ఊహాగానాలు నడిచాయి. స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్‌తో శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ ఉంటుంది అని, కాదు వరుణ్ ధావన్ తో కలిసి శ్రీలీల హిందీ ఎంట్రీ కన్ ఫర్మ్ అనే వార్తలు వైరల్ అయ్యాయి.
ఈమద్యలో శ్రీలీలకు బాలీవుడ్ సక్సెస్ ఫుల్ హీరో కార్తీక్ ఆర్యన్ మూవీలో ఆఫర్ వచ్చింది, కరణ్ జోహార్ నిర్మాతగా శ్రీలీల గ్రాండ్ ఎంట్రీ అన్నారు. శ్రీలీల హిందీ ఎంట్రీ కన్ ఫర్మ్ అయ్యింది. తాజాగా శ్రీలీల బాలీవుడ్ లో మెరిసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మాడాక్ ఫిలింస్ ఆఫీస్‌లో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్‌తో శ్రీలీల ముంబైలో కనిపించింది.
తాజాగా వీరిద్దరూ మాడాక్ ఆఫీసుకి వెళ్లి రావడంతో వీరిద్దరూ కలిసి సినిమా చేస్తారు అని ఫిక్స్ అవుతున్నారు. ఫైనల్లీ శ్రీలీల ముంబైలో కనిపించేసరికి ఆమె అభిమానులు చాలా హ్యాపీ మోడ్ లోకి వెళ్లిపోతున్నారు.