జూనియర్ ఎన్టీఆర్ కు, బాలయ్యకు మద్యన బంధం ఎలా ఉంటుందో అందరూ చూస్తున్నారు. అప్పుడప్పుడు కలిసి కనిపించే బాబాయ్-అబ్బాయ్ లు కొన్నాళ్లుగా కలిసి కనిపించిన సందర్భమే లేదు. బాలయ్య కు ఎన్టీఆర్ పై కోపం, ఎన్టీఆర్ కూడా నందమూరి ఫ్యామిలీతో కలిసి ఉండడు, కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ కోసం నందమూరి ఫ్యామిలీకి దూరం జరిగాడు అంటూ సోషల్ మీడియాలో తరచూ కనిపించే వార్తలే.
అయితే ఈమధ్యన ఆహా అన్ స్టాపబుల్ టాక్ షో లో దర్శకుడు బాబీ చేసిన చిత్రాలను, త్రివిక్రమ్ హీరోలతో చేసిన చిత్రాలను ప్రస్తావించే సమయంలో ఎన్టీఆర్ సినిమాల ప్రస్తావన పక్కన పెట్టడంతో బాలకృష్ణ కావాలనే టాక్ షోలో ఎన్టీఆర్ ని అవాయిడ్ చేస్తున్నారు, ఆఖరికి ఎన్టీఆర్ పేరు తలవడానికి కూడా బాలయ్యకు ఇష్టం లేదు.
అందుకే తన షో కి ఎన్టీఆర్ ని ఇంతవరకు పిలవలేదు.. అంటూ మాట్లాడుకుంటున్నారు. అయితే ఎన్టీఆర్-బాలయ్య మద్య గ్యాప్ లేదు, బాలయ్య ఎన్టీఆర్ సినిమా పేరు గుర్తు లేదు కాని, ఆ పాత్ర ఎన్టీఆర్ తప్ప మరెవ్వరు చేయలేరు అన్నారు అంటూ చెప్పడం చూస్తే బాలయ్య-ఎన్టీఆర్ బంధాన్ని కవర్ చేస్తున్న నిర్మాత అంటారేమో.
డాకు నిర్మాత నాగవంశీ డాకు మహారాజ్ సినిమా రిలీజ్ ఇంటర్వ్యూలో మట్లాడుతూ.. బాలయ్య ఎన్టీఆర్ పేరు తియ్యకపోవడం అనేది క్యాజువల్ గా జరిగింది, ఆయన ఓసారి నాతో బాబీ తో మాట్లాడుతూ.. సినిమా పేరు గుర్తు రావట్లేదు.. ఓ మూవీలోని ఆ క్యారెక్టర్ జూనియర్ ఎన్టీఆర్ చేస్తే బాగుంటుందని నా దగ్గర, బాబీ దగ్గర బాలయ్య అన్నారు.. అది లైవ్ లో కాదు.. ఆఫ్ లైన్ లో అలా అన్నారు అంటూ బాలయ్యకు ఎన్టీఆర్ పై ప్రేమ ఉంది అన్నట్లుగా నాగవంశీ చెప్పుకొచ్చారు.