కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కి బైక్ రేసింగ్స్, కార్ రేసింగ్స్ అంటే ఎంతిష్టమో వేరే చెప్పక్కర్లేదు. ఆయన బైక్ పై చెన్నై టు హైదరాబాద్, అలాగే స్పోర్ట్స్ కారుల రేసింగ్స్ అవి చేస్తూ ఉంటారు. అయితే తాజాగా అజిత్ రేసింగ్ కారుకి జరిగిన యాక్సిడెంట్ సామజిక మాద్యమాల్లో వైరలయ్యింది.
దుబాయ్ లో కారు రేస్ కోసం ప్రాక్టీస్ చేస్టుండగా గోడను ఢీ కొన్న అజిత్ స్పోర్ట్స్ కారు, గోడను ఢీ కొనడంతో ట్రాక్ పై గిర్రున తిరిగిన అజిత్ కారు, తక్షణమే స్పందించిన భద్రత సిబ్బంది,ఆ వెంటనే ప్రమాదం జరిగిన స్పోర్ట్ కారులో నుంచి వేరే కారులోకి అజిత్ తరలింపు
దుబాయ్ లో ఈ నెల 11, 12 తేదీల్లో జరుగనున్న 24H దుబాయ్ 2025 రేసు కోసం ప్రాక్టీస్ చేస్తున్న అజిత్, ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డ అజిత్, ఈ యాక్సిడెంట్ లో అజిత్‌కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అభిమానులు. ప్రస్తుతం అజిత్ కారు యాక్సిడెంట్ వీడియో నెట్టింట సంచలంగా మారింది.