రకుల్ ప్రీత్ సోషల్ మీడియా అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎప్పటికప్పుడు ట్రెండీ డ్రెస్సులతో మెస్మరైజ్ చేస్తుంది. రీసెంట్ గా భర్త జాకీ భగ్నానీ బర్త్ డే సెలబ్రేషన్స్ దగ్గర నుంచి న్యూ ఇయర్ పార్టీ వరకు అన్ని ఎంజాయ్ చేసిన రకుల్ ప్రీత్ ఇప్పుడు 2025 ని గ్లామర్ గా మొదలు పెట్టింది.
తాజాగా రకుల్ బ్లాక్ డ్రెస్సులో ఇచ్చిన ఫోజులకు యూత్ మొత్తం ఫిదా అవ్వాల్సిందే. కొన్ని వారాల క్రితం జిమ్ లో నడుం పట్టేసి బెడ్ రెస్ట్ లో ఉన్న రకుల్.. సినిమా షూటింగ్స్ కి కాస్త బ్రేకిచ్చినా సోషల్ మీడియాకి మాత్రం బ్రేక్ ఇవ్వలేదు. ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫొటోస్ ని షేర్ చేస్తూ సందడి చేస్తుంది.
ఇక రకుల్ నటిస్తున్న హిందీ చిత్రాలు ఈ ఏడాది ఒకటి రెండు విడుదలయ్యే అవకాశం వుంది. మరి ఇప్పటిరకు హిందీలో సక్సెస్ లేని రకుల్ ప్రీత్ ఇకపై ఏమైనా సక్సెస్ ట్రాక్ లోకి వస్తుందేమో చూడాలి.