మెగాస్టార్ ముద్దుల మనవరాలు, రామ్ చరణ్ గారాల పట్టి క్లింకార దర్శనం కోసం మెగా ఫ్యాన్స్ వేచి చూడని క్షణం లేదు. రామ్ చరణ్-ఉపాసనలు తమ బిడ్డను తమకి పరిచయం ఎప్పడు చేస్తారా అని ఆత్రుత పడని రోజు లేదు. కానీ ఇప్పటివరకు క్లింకార ని చూపించకుండా చరణ్ దంపతులు ఎన్నాళ్లు దాస్తారో అంటూ మాట్లాడుకుంటున్నారు.
మరి ఆహా అన్ స్టాపబుల్ టాక్ షోలో బాలయ్య రామ్ చరణ్ ను అదే ప్రశ్న అడిగారు. రామ్ చరణ్ తన కుమార్తె క్లింకార గురించి ఆ టాక్ షోలో షేర్ చేసుకుంటూ తన కూతురుతో రోజూ ఉదయం రెండు గంటలు ఆడుకుంటాను అని చెప్పగా.. మరి క్లింకార ని మాకు ఎప్పుడు చూపిస్తారు అని అడిగారు బాలయ్య.
దానికి రామ్ చరణ్ తను నన్ను ఎప్పుడు నాన్న అని పిలుస్తుందో అప్పుడే క్లింకార ను అందరికి చూపిస్తా అంటూ మాటిచ్చేసారు. అంతేకాదు తాను ఉపాసన గొడవపడినప్పుడు తమ పెట్ రైమా తమకి ప్యాచప్ చేస్తుంది అంటూ షోలో బాలయ్యకు తన రైమాను పరిచయం చేసారు చరణ్. ఈ ఎపిసోడ్ సంక్రాంతి స్పెషల్ గా స్ట్రీమింగ్ కాబోతుంది.