Advertisement
Google Ads BL

GCతో నాకూ నేషనల్ అవార్డ్- అంజలి


గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కి, ఈ సంక్రాంతికి థియేటర్లలోకి రాబోతోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం గేమ్ చేంజర్. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ‌తో పాటు అంజలి హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన గేమ్ చేంజర్ సినిమా.. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ సినిమాలో అప్పన్న పాత్రకు జోడీగా నటించిన అంజలి.. తనకూ నేషనల్ అవార్డ్ వస్తుందని ఆశపడుతున్నట్లుగా చెప్పుకొచ్చింది. ఎందుకంటే, ఇటీవల సుకుమార్ మాట్లాడుతూ.. చరణ్‌కు నేషనల్ అవార్డు ఈసారి పక్కా అనేలా చెప్పుకొచ్చారు. ఇప్పుడు అంజలి కూడా అదే అంటోంది. తాజాగా ఆమె గేమ్ చేంజర్ విశేషాలను మీడియాతో పంచుకుంది. అంజలి ఇంటర్వ్యూలోని హైలెట్స్ ఇవే..

Advertisement
CJ Advs
  • సంక్రాంతికి నేను నటించిన రెండు చిత్రాలు రిలీజ్‌కు వస్తున్నాయి. ఏ యాక్టర్‌కి అయినా సంక్రాంతికి సినిమా వస్తుందంటే ఆనందంగా ఉంటుంది. తెలుగులో గేమ్ చేంజర్, తమిళంలో విశాల్ చిత్రం వస్తుంది. ఈ రెండు చిత్రాలు నాకు మంచి పేరు తీసుకొస్తాయని అనుకుంటున్నాను.
  • గేమ్ చేంజర్‌లో నా పాత్ర పేరు పార్వతి. రియల్‌ లైఫ్‌లో మా అమ్మ పేరు కూడా పార్వతే. ఈ పాత్ర గురించి చెప్పగానే నాకు మా అమ్మే గుర్తుకు వచ్చింది. ఈ సినిమాలో నా పాత్రకు చాలా వెయిటేజ్ ఉంటుంది. నేను కూడా అదే స్థాయిలో నటించానని అనుకుంటున్నా. శంకర్ గారు నా పెర్ఫార్మెన్స్ చూసి చాలా చోట్ల మెచ్చుకున్నారు. ఇది నా కెరీర్‌లో ది బెస్ట్ చిత్రం, కారెక్టర్ అవుతుంది.
  • పార్వతి పాత్ర కోసం నేనేమీ ప్రత్యేకంగా ప్రిపేర్ అవ్వలేదు. నా పాత్ర గురించి శంకర్‌గారు ఇప్పటికే చాలా చెప్పారు. ఇంకా నేను ఏమీ చెప్పలేను. ఒక్కటి మాత్రం చెప్పగలను.. సెట్స్ నుంచి వచ్చినా కూడా ఆ పాత్ర చాలా రోజులు నన్ను వెంటాడుతూనే వచ్చింది. నా కెరీర్‌లో ఇదే బెస్ట్ కారెక్టర్.
  • పార్వతి పాత్ర గురించి తెలిసిన వారంతా నేషనల్ అవార్డు వస్తుందని అంటుంటే చాలా హ్యాపీగా ఉంది. నేను కూడా కథ విన్నప్పుడు అలానే అనుకున్నాను. నాక్కూడా అలానే అనిపించింది. అంతా అంటున్నట్టుగా అదే జరిగితే.. నాకు అంతకంటే గొప్ప విషయం ఏం ఉంటుంది. ఆ దేవుడి దయ వల్ల అది నిజం కావాలని కోరుకుంటున్నాను. అయినా చిరంజీవి గారు సినిమా చూసి నా పాత్రను మెచ్చుకున్నారని తెలిసింది. అదే నాకు పెద్ద అవార్డులా అనిపిస్తోంది.
  • ఈ పాత్ర విషయంలో నాకు ఎదురైన సవాళ్లు అంటే.. బయటే జరిగే సంఘటనలు, ఎదురైన అనుభవాల నుంచే ఏ యాక్టర్ అయినా కూడా తెరపై నటించేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ ఈ సినిమాలోని కారెక్టర్‌, ఆ బ్యాక్ డ్రాప్ చాలా కొత్తది. ఈ పాత్ర నాకు కూడా చాలా కొత్తగా అనిపించింది. అందుకే ఈ పాత్రను పోషించేందుకు, నటనతో ఆడియెన్స్‌ను నమ్మించేందుకు, మెప్పించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. 
  • పార్వతి పాత్రలో చాలా సోల్ ఉంటుంది. ఎక్కువగా రివీల్ చేయకూడదనే ట్రైలర్, టీజర్‌లో తక్కువ షాట్స్ పెట్టారు. నా పాత్రను తెరపై చూసినప్పుడు ఆడియెన్స్ థ్రిల్ ఫీల్ అవుతారు. అప్పన్న, పార్వతీల ప్రేమ, వారి బంధం చాలా గొప్పగా ఉంటుంది. అదే ఈ సినిమాకు ప్లస్ అవుతుంది.
  • రామ్ చరణ్ తన కో స్టార్స్‌కు కంఫర్ట్ ఇస్తారు. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ చాలా కామ్‌గా ఉంటారు. సెట్స్‌లో అందరితోనూ బాగా ఉంటారు. అందరితోనూ చక్కగా మాట్లాడతారు. ఆయన పెద్ద స్టార్ అనేలా ఎప్పడూ బిహేవ్ చేయలేదు. చాలా నార్మల్‌గా కలిసిపోతారు. 
  • గేమ్ చేంజర్ సినిమా వల్ల నా ఆలోచనాధోరణి మారింది. ఈ ప్రయాణంలో ఎంతో మార్చుకున్నాను, నేర్చుకున్నాను. ఇక నెక్ట్స్ ఎంచుకునే పాత్రలు, సినిమాల విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఈ విషయంలో ఈ సినిమా నాకు గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు.
  • ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అరుగు మీద అంటూ ఓ పాటను రిలీజ్ చేశారు. ఆ పాట చాలా బాగా వచ్చింది. ఇప్పటికే ఈ పాట రీల్స్‌లో ట్రెండ్ అవుతోంది. నాకే కాకుండా టీం అందరికీ కూడా అది ఫేవరేట్ సాంగ్. అది ఎప్పటికీ నిలిచిపోయే పాట.
  • దిల్ రాజు గారి నిర్మాణంలో నాకు ఎప్పుడూ గొప్ప చిత్రాలే వచ్చాయి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, వకీల్ సాబ్ ఇలా అన్నీ మంచి చిత్రాలే వచ్చాయి. ఇప్పుడు గేమ్ చేంజర్ రాబోతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అంటే.. నాకు హోం బ్యానర్‌గా మారిపోయింది.

Actress Anjali Interview about Game Changer Movie:

Anjali talks about Game Changer
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs