మరో మూడు రోజుల్లో రామ్ చరణ్-శంకర్‌ల గేమ్ చేంజర్ విడుదల కాబోతున్న తరుణంలో తమిళనాట ఈ సినిమాను ఆపాలని లైకా వారు చూశారు. ఇండియన్ 2తో భారీగా నష్టపోయిన లైకా నిర్మాతలు, గేమ్ చేంజర్‌ని తమిళనాట ఆపి రివెంజ్ తీర్చుకోవాలని చూశారు. గేమ్ చేంజర్ విడుదల ఆపాలని లైకా వాళ్లు నిర్మాతల మండలిని ఆశ్రయించడంతో గేమ్ చేంజర్ తమిళనాట విడుదల కష్టమనేలా వార్తలు వైరల్ అవుతున్నాయి.
మెగా అభిమానులు కూడా గేమ్ చేంజర్ తమిళ రిలీజ్ విషయంలో చాలా టెన్షన్ పడుతున్నారు. దర్శకుడు శంకర్ ఇండియన్ 2 కోసం గేమ్ చేంజర్‌ని మూడేళ్లపాటు చిత్రీకరించి మెగా ఫ్యాన్స్‌ని నిరీక్షించేలా చేశారు. ఇండియన్ 2 తో పాటుగా ఇండియన్ 3ని కూడా కొంతమేరకు ఆయన రెడీ చేశారు. ఇండియన్ 2 డిజాస్టర్ అవడంతో లైకా సంస్థ భారీగా నష్టపోయింది.
గేమ్ చేంజర్ విడుదలైతే అది ఇండియన్ 3 కి హెల్ప్ అయ్యేది. కానీ గేమ్ చేంజర్‌ని లైకా వారు ఆపాలని చూసి చులకనవడమే కాకుండా.. శంకర్‌కి మరింత కోపం తెప్పించారు. మరోపక్క గేమ్ చేంజర్‌ని తమిళ నిర్మాతల మండలి రిలీజ్ ఏమీ ఆపట్లేదని.. ఈ సినిమా అనుకున్నట్లే తమిళంలో కూడా జనవరి 10నే విడుదల కాబోతోందని చెప్పినట్లుగా తెలుస్తోంది.