Advertisement
Google Ads BL

దేవత- కన్నప్పలో కాజల్ రోల్ రివీలైంది


విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటున్న కన్నప్ప చిత్రంలో భారీ తారాగణం ఉన్న విషయం తెలిసిందే. ఆ తారాగణానికి సంబంధించిన ఒక్కొక్కరి లుక్‌ని రివీల్ చేస్తూ వస్తున్నారు మేకర్స్. ఇప్పటికే మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, మధుబాల, శరత్ కుమార్, దేవరాజ్ వంటి వారి పాత్రలను రివీల్ చేసిన మేకర్స్.. లాస్ట్ సోమవారం హీరోయిన్ ప్రీతి ముఖుంధన్ పాత్రని రివీల్ చేశారు. ఇందులో ప్రీతి ముఖుంధన్ నెమలి పాత్రలో నటిస్తున్నట్లుగా తెలిపారు. ఇక ఇప్పుడు కాజల్ వంతు వచ్చింది. 

Advertisement
CJ Advs

కన్నప్ప చేసిన సోమవారం ప్రామిస్ పాటిస్తూ.. ఈ సోమవారం ఇందులోని కాజల్ అగర్వాల్ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ని మేకర్స్ వదిలారు. కన్నప్పలో కాజల్ గాడెస్ పార్వతీదేవి పాత్రలో కనిపించనుందని తెలిపారు. ముల్లోకాలు ఏలే తల్లి! భక్తుల్ని ఆదుకునే త్రిశక్తి! శ్రీకాళహస్తిలో వెలసిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక!.. అంటూ అమ్మవారి అవతారంలో ఉన్న కాజల్ అగర్వాల్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు.

ఈ పోస్టర్‌లో కాజల్ అగర్వాల్ నిజంగా దేవతలానే కనిపిస్తుంది. తన లుక్, ఆహార్యం అంతా కూడా నిజంగా దేవతలు ఇలానే ఉంటారా? అనేలా ఉందంటే.. ఈ పాత్రకి ఆమె పర్ఫెక్ట్‌గా సూటయిందని చెప్పుకోవచ్చు. కాజల్ విషయానికి వస్తే.. ఇంతకు ముందు ఇదే మంచు విష్ణుకి సోదరిగా ఆమె నటించింది. మోసగాళ్లు సినిమాలో విష్ణు, కాజల్ సోదరసోదరీమణులుగా నటించిన విషయం తెలిసిందే. ఇక కాజల్ పోస్టర్‌తో ఈ సోమవారం కన్నప్ప వార్తలలో నిలుస్తోంది. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. 25 ఏప్రిల్, 2025న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది.

Kajal Aggarwal Role From Kannappa Revealed:

Kajal Agarwal Plays Goddess Parvati Role in Kannappa
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs