పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, నా ఫ్యామిలీలోని నా బిడ్డలందరూ నా అచీవ్‌మెంటే అని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆప్త (అమెరికన్ ప్రొగ్రెసివ్ తెలుగు అసోసియషన్) బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈవేడుకకి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో యువ పారిశ్రామికవేత్తలకు తన లైఫ్ స్టోరీని వివరించారు మెగాస్టార్.
ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నువ్వేం సాధించావు అంటే.. అభిమానులని, అభిమానాన్ని సాధించానని చెప్పుకుంటానని అన్నారు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, నా ఫ్యామిలీలోని నా బిడ్డలందరూ నా అచీవ్‌మెంటే అని అన్నారు. ఆయన మాట్లాడుతూ.. మొన్న పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు. అన్నయ్యా నువ్వొక మాట అనేవాడిని గుర్తుందా.. మన ఇంట్లో ఇంత మంది మీరున్నందుకు? ఈ అవకాశం నాకు భగవంతుడు ఇచ్చినందుకు, ఇది నాతో ఆగిపోకూడదు. ఒక రాజ్ కపూర్ ఫ్యామిలీలో ఎంత మంది అయితే ఉన్నారో, ఆ రకంగా మరో రాజ్ కపూర్ ఫ్యామిలీలా మన మెగా ఫ్యామిలీ కావాలని నువ్వు అంటుండేవాడివి. ఈరోజు నీ మాట మంత్రంలాగా పని చేసిందన్నయ్యా.. నువ్వు కన్విక్షన్‌తో అంటావు.. అందులో ఎలాంటి పొల్యూషన్ ఉండదు.. అని అన్నాడు.
నిజంగా ఈ మధ్య ఓ పత్రిక కపూర్ ఫ్యామిలీ ఆఫ్ సౌత్ అని మా గురించి ప్రస్తావించినప్పుడు.. భగవంతుడా! ఇది నా గొప్పతనం కాదు, నువ్వు, ప్రేక్షకులు, అభిమానులు ఇలా ఆదరించారు కాబట్టే ఇక్కడున్నాము అని అనుకున్నాను.. అని మెగాస్టార్ చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ ఇంకా ఎన్నో విషయాలను షేర్ చేసుకుని, హాజరైన వారందరిలో స్ఫూర్తి నింపారు.