Advertisement
Google Ads BL

అకీరా ఎంట్రీపై రేణు ఆసక్తికర వ్యాఖ్యలు


మెగాభిమానులందరూ ఎంతగానో వేచి చూస్తున్న అకీరా నందర్ ఎంట్రీపై రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తూర్పు గోదావరి జిల్లాలోని ఓ కార్యక్రమానికి హాజరైన రేణు దేశాయ్‌ని అక్కడి మీడియా అకీరా నందన్ ఎంట్రీ ఎప్పుడంటూ ప్రశ్నించింది. దీనికి ఆమె స్పందిస్తూ.. 

Advertisement
CJ Advs

ఎక్కడికి వెళ్లినా అకీరా నందన్ సినిమాలలోకి ఎప్పుడు వస్తున్నారని అంతా అడుగుతున్నారు. ఒక తల్లిగా ఆ కోరిక మీకంటే కూడా నాకే ఎక్కువగా ఉంది. అభిమానులు కోరుకుంటున్నట్లుగా అకీరా సినిమాలలోకి రావాలని నేనూ కోరుకుంటున్నాను. కాకపోతే.. సినిమాలలోకి ఎప్పుడు రావాలనేది అకీరా నిర్ణయానికే వదిలేశాను. అకీరా తన ఇష్టంతోనే సినిమాలలోకి రావాలని నేను కోరుకుంటున్నాను. అంత వరకు అంతా వేచి చూడాలని కోరుతున్నాను.. అని అకీరా సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది.

ఫ్యాన్స్ మాత్రం త్వరగా రావాలని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మూడు సినిమాలు చేస్తున్నారు. ఆ తర్వాత ఆయన సినిమాలు చేసే అవకాశం లేదు. పూర్తిగా పాలిటిక్స్‌పైనే దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఈ లోపు అకీరా రెడీ అయితే.. పవన్ కళ్యాణ్ వారసుడిగా, ఆయన సినిమా ఇండస్ట్రీలో లేని లోటు అకీరా తీర్చేస్తాడని అభిమానుల ఆశ.

ఇక అకీరా ఎంట్రీపై రేణు దేశాయ్ మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆ వీడియోకు కొందరు అభిమానులు రామ్ చరణ్‌ని ట్యాగ్ చేస్తూ.. మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమాలను ఎలా అయితే నిర్మించావో.. అకీరాతో కూడా రెండు మూడు ప్రాజెక్ట్స్ ప్లాన్ చెయ్ అన్నా అంటూ కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.

Renu Desai about DY CM Pawan Son Akira Cine Entry:

Renu Desai excited for Akira debut
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs