ఆహా ఓటీటీలో నందమూరి నటసింహం హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె షో సీజన్ 4కి చేరుకుంది. ఈ సీజన్‌లో తొలి ఎపిసోడ్‌ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో మొదలెట్టిన టీమ్.. ఒక్కో ఎపిసోడ్‌కు ఊహించని గెస్ట్‌లను ఆహ్వానిస్తూ.. అందరినీ సర్‌ప్రైజ్ చేస్తుంది. ఇక వచ్చిన గెస్ట్‌లతో బాలయ్య ఆడుకుంటున్న తీరు, ఎంటర్‌టైన్ చేస్తున్న జోరు.. ఈ షోను ఎక్కడికో తీసుకెళ్లిపెట్టింది. ఇక ఈ సీజన్‌కే హైలెట్ అయిన ఎపిసోడ్‌ని సంక్రాంతి సర్‌ప్రైజ్‌గా తెచ్చేందుకు ఆహా అన్ని విధాలా ప్రయత్నం చేస్తుంది.
ఏంటా హైలెట్ అనుకుంటున్నారా? ఈ సీజన్ హైలెట్ ఎపిసోడ్ రామ్ చరణ్‌తో ప్లాన్ చేసింది టీమ్. వాస్తవానికి ఈ సీజన్‌లో మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ వంటి వారు వస్తారనేలా టాక్ నడిచింది. కానీ గేమ్ చేంజర్ సినిమా ఉండటంతో.. ఈ సీజన్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ షోకి సరిపడా హైప్‌ని తెచ్చేశారు. రామ్ చరణ్‌తో ఎపిసోడ్‌ని ఆల్రెడీ షూట్ చేసిన టీమ్.. తాజాగా ఓ ప్రోమోని వదిలింది.
ఈ ప్రోమో చూస్తుంటే.. ఎప్పుడెప్పుడు ఎపిసోడ్ వస్తుందా అని ఎదురు చూసేలా ఉంది. రామ్ చరణ్‌తో పాటు అతని ఫ్రెండ్స్ అయిన శర్వానంద్‌ని, మరో వ్యక్తి కూడా ఈ షోలో కనిపించడం విశేషం. ఇక వారితో బాలయ్య ఆడుకున్న తీరు చెబితే సరిపోదు.. కింది వీడియో చూసేయాల్సిందే. జనవరి 8న ఈ ఎపిసోడ్ ప్రీమియర్ కానుంది.