Advertisement
Google Ads BL

కింగ్ ఆఫ్ జంగిల్.. డాకు ట్రైలర్ రోర్


గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ చిత్ర ట్రైలర్ వచ్చేసింది. సంక్రాంతికి డాకు మహారాజ్‌గా వచ్చేందుకు బాలయ్య సిద్ధమయ్యారు. ఈ చిత్ర ప్రమోషన్స్ నిమిత్తం అమెరికాలో చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. శ్రీకరా స్టూడియోస్ సమర్పిస్తోంది. సంక్రాంతి కానుకగా 12 జనవరి, 2025న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలకు సిద్ధమైన ఈ సినిమాలో యాక్షన్, వినోదం, భావోద్వేగాల మేళవింపుతో సంక్రాంతికి సునామీ రాబోతుందనేది జస్ట్ వచ్చిన ఈ ట్రైలర్ క్లారిటీ ఇచ్చేసింది. డాకు మహారాజ్ ట్రైలర్ ఎలా ఉందంటే.. 

Advertisement
CJ Advs

మెయిన్‌గా ఈ సినిమాలో ఓ పాప హైలెట్ అవుతుందనేది ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. బాలయ్య స్క్రీన్ ప్రెజన్స్ సరికొత్తగా ఉండటమే కాకుండా.. మాస్ ఫీస్ట్ అనేలా ఆయన క్యారెక్టర్‌ను బాబీ డిజైన్ చేశాడనేది అడుగడుగునా తెలుస్తుంది. కొంతమేర భగవంత్ కేసరి ఛాయలు కనిపిస్తున్నా.. బాబీ మాత్రం ఏదో మాయ చేయబోతున్నాడనేది ఈ ట్రైలర్‌తో అందరికీ క్లారిటీ వచ్చేసింది. ఒక్కో పాత్రను రివీల్ చేస్తూ.. స్టోరీ తెలియనీయకుండా ట్రైలర్‌ను ప్రజెంట్ చేశారు. ఈ ట్రైలర్ తర్వాత డాకు‌ని చూసే విధానమే మారిపోవచ్చు. మాస్ జాతరకు నందమూరి ఫ్యాన్స్ వెయిటింగ్ అనే సిగ్నల్స్ పంపుకోవచ్చు.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పాటలు చార్ట్ బస్టర్స్‌గా నిలవగా.. ఇప్పుడొచ్చిన ట్రైలర్.. ఈ కింగ్ ఆఫ్ జంగిల్ కోసం వెయిట్ చేసేలా చేస్తుందనడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. బాలయ్య సరసన ముగ్గురు భామలు నటిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. మొత్తంగా అయితే.. సంక్రాంతికి డాకు థియేటర్లలో సృష్టించే బీభత్సం మాములుగా ఉండదనే విషయం మాత్రం ఈ ట్రైలర్ తెలియజేస్తుంది. 

Daaku Maharaaj Theatrical Trailer Released:

Daaku Maharaaj Theatrical Trailer Out 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs